APSRTC: ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వర్ల రామయ్య

  • ఏప్రిల్ 24తో ముగిసిన వర్ల పదవీకాలం
  • సెప్టెంబరులో నోటీసులు పంపిన ప్రభుత్వం
  • రాజీనామా లేఖను ప్రిన్సిపల్ కార్యదర్శికి పంపిన వర్ల రామయ్య

టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఎన్నికల్లో టీడీపీ పరాజయంపాలైన వెంటనే ఆయన ఆర్టీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటారని భావించారు. కానీ ఆయన పదవికి రాజీనామా చేయకపోవడంతో ప్రభుత్వం నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య తన రాజీనామా లేఖను ఏపీ రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి పంపారు. వర్ల రామయ్య పదవీకాలం 2019 ఏప్రిల్ 24తో ముగిసింది. దాంతో సెప్టెంబరులో ఆయనకు నోటీసులు పంపారు.

APSRTC
Andhra Pradesh
Telugudesam
Varla Ramaiah
  • Loading...

More Telugu News