TSRTC: తెలంగాణ ఆర్టీసీ సమ్మె: ఎట్టకేలకు చర్చలు ప్రారంభం

  • ఆర్టీసీ జేఏసీ నేతలతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ భేటీ
  • 22 రోజులుగా కొనసాగుతున్న సమ్మె
  • ఎర్రమంజిల్ లోని ఈఎన్ సీ కార్యాలయంలో చర్చలు

తెలంగాణలో గత 22 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెరదించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జేఏసీ నేతలకు ఆర్టీసీ యాజమాన్యం లేఖలు రాసింది. శనివారం చర్చలకు రావాలని ఆహ్వానించింది. ఈ నేఫథ్యంలో ఎర్రమంజిల్ లోని ఈఎన్ సీ కార్యాలయంలో ఇరు వర్గాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీ, ఈడీలు, జేఏసీ నేతలు పాలుపంచుకున్నారు. కార్మిక నేతలు సమావేశంలో అనుసరించే వ్యూహంపై ముందే ఆలోచించి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ తో పాటు మరో 25 డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News