Telangana: తెలంగాణ గవర్నర్ తమిళిసైని స్నేహపూర్వకంగానే కలిశాను: స్వామి పరిపూర్ణానంద

  • రాజ్ భవన్ కు వెళ్లిన పరిపూర్ణానంద
  • గవర్నర్ తమిళిసైతో భేటీ
  • ఆర్టీసీ సమ్మెపైనా స్పందించిన పరిపూర్ణానంద

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను ఇవాళ హైదరాబాద్, రాజ్ భవన్ లో స్వామి పరిపూర్ణానంద కలిశారు. తమిళిసైతో స్నేహపూర్వకంగానే భేటీ అయినట్టు ఆయన తెలిపారు. తమిళిసై తెలంగాణ గవర్నర్ గా వచ్చిన తర్వాత ఇప్పటివరకు కలవడం కుదరలేదని, అందుకే కలిశానని అన్నారు. గవర్నర్ తో తాను రాజకీయాల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. కాగా, ఈ బీజేపీ నేత తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపైనా స్పందించారు. ఆర్టీసీ వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారుతోందని అన్నారు.

Telangana
Governror
Tamilisai
Swami Paripurnananda
Hyderabad
  • Loading...

More Telugu News