Diwali: దీపావళి సీజన్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీల అమ్మకాలు అదుర్స్

  • మూడో త్రైమాసికంలో 4.9 కోట్ల ఫోన్ల అమ్మకం
  • ధరలు తగ్గడంతో ఐఫోన్లకు పెరిగిన గిరాకీ
  • 24 రోజుల్లో 5 లక్షల టీవీలు విక్రయించిన షియోమీ 

ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా అనేక రంగాలు కుదేలైనా ఎలక్ట్రానిక్స్ రంగం మాత్రం అమ్మకాల పరంగా రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ దీపావళి సీజన్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీల అమ్మకాలు హుషారెతిస్తున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 4.9 కోట్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ ఎప్పట్లాగానే అగ్రస్థానంలో ఉంది. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 26 శాతం వాటాతో ఇది నెంబర్ వన్ గా కొనసాగుతోంది.

అటు యాపిల్ సంస్థ ధరలు తగ్గించడంతో భారత్ లో ఐఫోన్ కొత్త మోడళ్లకు లాభసాటి మార్కెట్ ఏర్పడింది. ఇక, స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న షియోమీ టెలివిజన్ రంగంలోనూ కాలుమోపింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈకామర్స్ సైట్ల ద్వారా ఈ సంస్థ టెలివిజన్ సెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నట్టు గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. సెప్టెంబరు 28 నుంచి 24 రోజుల వ్యవధిలో షియోమీ 5 లక్షలకు పైగా టీవీలు విక్రయించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో పేరుమోసిన టెలివిజన్ బ్రాండ్లను తలదన్నే రీతిలో ఈ సంస్థ టాప్ సెల్లర్ గా నిలుస్తోంది.

  • Loading...

More Telugu News