Amazon: అమెజాన్ అధినేతను వెనక్కినెట్టిన బిల్ గేట్స్... మళ్లీ వరల్డ్ నెంబర్ వన్
- గతేడాది నెంబర్ వన్ గా నిలిచిన జెఫ్ బెజోస్
- త్రైమాసిక ఫలితాల్లో పడిపోయిన అమెజాన్ షేర్లు
- బెజోస్ కు భారీ నష్టం
- 105.7 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో బిల్ గేట్స్
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా అవతరించారు. తాజా త్రైమాసిక ఫలితాల్లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 7 బిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. అమెజాన్ షేర్ విలువ పడిపోవడం కారణంగానే బెజోస్ కు తాజా త్రైమాసికంలో భారీ నష్టాలు వాటిల్లినట్టు అర్థమవుతోంది.
ప్రస్తుతం బెజోస్ సంపద 103.9 బిలియన్ డాలర్లకు చేరడంతో ఆయన రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో 105.7 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. 2018లో మినహాయించి గేట్స్ అనేక సంవత్సరాలు ప్రపంచ నెంబర్ వన్ సంపన్నుడిగా కొనసాగారు.