Varla Ramaiah: ఎగిరెగిరి ఓట్లేసిన మాకు ఇప్పుడీ శాస్తి జరగవలసిందేనని బాధపడుతున్నారు: వర్ల రామయ్య

  • సీఎం జగన్ పై వర్ల రామయ్య విమర్శలు
  • భవన నిర్మాణ రంగం కుదేలైందన్న టీడీపీ నేత
  • తమ గోడు వినమని కార్మికులు మొత్తుకుంటున్నారని వెల్లడి

రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని, ఇసుక కొరతతో పనులు ఆగిపోవడం వల్ల నిర్మాణ రంగ కార్మికులు దయనీయ స్థితిలో ఉన్నారని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడు ఎగిరెగిరి ఓట్లేసిన మాకు ఇప్పుడీ శాస్తి జరగాల్సిందేనని కార్మికులు బాధపడుతున్నారని వివరించారు.

'సీఎం గారూ, మీరొచ్చినప్పటి నుంచి మాకు ఇసుక లేదు, పనిలేదు, తినడానికి తిండి లేదు' అంటూ భవన నిర్మాణ రంగ కార్మికులు ఆక్రోశిస్తున్నారని వర్ల రామయ్య ట్వీట్ చేశారు. 'కొరివితో తల గోక్కున్నాము, ఇప్పుడు అనుభవిస్తున్నాం, మా గోడు పట్టించుకోరా' అంటూ ఇసుక కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

Varla Ramaiah
Jagan
Telugudesam
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News