cm: సీఎం జగన్ ను కలిసిన వల్లభనేని వంశీ!

  • కొడాలి నాని, పేర్ని నానితో కలిసి వెళ్లిన వంశీ
  • జగన్ తో దాదాపు అరగంట పాటు మంతనాలు 
  • వంశీ పార్టీ మారతారన్న ఊహాగానాలు

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు కలిసిన విషయం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మరో ఆసక్తికర ఘటన కూడా ఈరోజు జరిగింది. ఏపీ సీఎం జగన్ ను వల్లభనేని వంశీ కలిశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి జగన్ ని ఆయన కలిశారు. వారి వాహనంలోనే వంశీ వచ్చినట్టు సమాచారం. దాదాపు అరగంట పాటు వారిద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం.

కాగా, వల్లభనేని వంశీ పార్టీ మారతారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో వల్లభనేని వంశీ నిన్న భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు సమాచారం.

cm
jagan
Telugudesam
Vallabhaneni Vamsi
  • Loading...

More Telugu News