cm: సీఎం కేసీఆర్ కు కార్మికులంటే లెక్కే లేదు: అశ్వత్థామరెడ్డి

  • బెదిరింపులకు కార్మికులు భయపడటంలేదు
  • పోరాటం మరింత ఉద్ధృతం చేస్తాం
  • 30న సకల జనుల సభ నిర్వహిస్తాం

సీఎం కేసీఆర్ కు కార్మికులంటే లెక్కేలేదని వారిని చులకన చేసి మాట్లాడారని ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో భేటీ అయిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం బెదిరింపులకు కార్మికులు భయపడటం లేదని చెప్పారు.

ఆర్టీసీని విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని విమర్శించారు.హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంలో ఆర్టీసీకి సంబంధం లేదని తెలిపారు. కేసులకు భయపడకుండా కార్మికుల పక్షాన మరింత పోరాటం చేస్తామన్నారు. 30న సరూర్ నగర్ మైదానంలో సలక జనుల సభ నిర్వహిస్తామని.. ప్రజలందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

cm
kcr
Tsrtc
jac
Aswathama reddy
  • Loading...

More Telugu News