Manda Krishna Madiga: ఆర్టీసీ సమ్మెకు మంద కృష్ణ మాదిగ మద్దతు   

  • మంచిర్యాలలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ
  • కేసీఆర్ పై మండిపడ్డ మంద కృష్ణ
  • అనవసర భేషజాలకు పోతున్నారంటూ మండిపాటు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. మంచిర్యాలలో ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. పలు ప్రజా సంఘాల కార్యకర్తలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అనవసర భేషజాలకు పోతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇదే ధోరణిని కొనసాగిస్తే... ఆర్టీసీ సమ్మె ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు.

Manda Krishna Madiga
MRPS
RTC
Strike
  • Loading...

More Telugu News