BJP: సుజనా చౌదరితో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ

  • ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం
  • కరణం బలరాం నివాసంలో భోజనం చేసిన సుజనా
  • తాజా రాజకీయాలపై ఇద్దరు నేతల చర్చ 

బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ అయ్యారు. కరణం బలరాం నివాసంలో సుజనా చౌదరి భోజనం చేసినట్టు సమాచారం. తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ రోజు ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సుజనా చర్చలు జరిపారు. సుజనాతో టీడీపీ నేతల వరుస భేటీలతో తెలుగుదేశం అధిష్ఠానం తలపట్టుకుంటోందని సంబంధిత వర్గాల సమాచారం.

BJP
Sujana Chowdary
Telugudesam
Karanam
  • Loading...

More Telugu News