Mahesh Babu: జగన్ భార్య భారతిని కలిసిన మహేశ్ బాబు భార్య నమ్రత

  • బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్ బాబు
  • అభివృద్ధి పనులను భారతికి వివరించిన నమ్రత
  • అంతకు ముందు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న నమ్రత

ఏపీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిని టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు భార్య నమ్రత కలిశారు. బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, గ్రామంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను భారతికి నమ్రత వివరించారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందించాలని కోరారు.

 మరోవైపు, తమ ఇంటికి వచ్చిన నమ్రతకు భారతి సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నారు. అంతకు ముందు నమ్రత విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. నమ్రతకు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఈవో అందజేశారు.

Mahesh Babu
Namrata
Jagan
YS Bharathi
YSRCP
  • Loading...

More Telugu News