hujurnagar: హుజూర్‌నగర్‌ ఫలితం చూసైనా విపక్షాలు నోరు జారడం మానాలి: మంత్రి తలసాని సూచన

  • ప్రజాభిమానం సంపాదించి మాట్లాడాలి
  • వార్డు సభ్యునికి వచ్చిన కూడా ఓట్లు బీజేపీకి రాలేదు
  • ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది

అధికార పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కంటే ప్రజల్లో పరపతిని సాధించి సత్తా చాటేందుకు విపక్షాలు ప్రయత్నం చేయాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ చురకంటించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా పేట్రేగిపోయిన విపక్ష నాయకులకు ఈ ఫలితాలు చెంపపెట్టన్నారు. తామే ప్రత్యామ్నాయమంటూ భీషణ ప్రతిజ్ఞలతో రెచ్చిపోయిన బీజేపీకి కనీసం ఓ వార్డు సభ్యునికి వచ్చిన ఓట్లు కూడా రాని విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అందువల్ల ముందు విపక్షాలు ప్రజల్లో పార్టీని బలపర్చుకుని అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు.

hujurnagar
resulsts
Talasani
opposition
  • Loading...

More Telugu News