Sujana Chowdary: సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ.. పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం!

  • గుంటూరులో బీజేపీ నేత ఇంటి వద్ద ఆగిన సుజనా చౌదరి
  • అక్కడకు వచ్చి సుజనాను కలిసిన వల్లభనేని వంశీ
  • ఇద్దరూ కలిసి ఒకే కారులో ఒంగోలుకు పయనం

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వంశీ పార్టీ మారే యోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఒంగోలు వెళ్తున్న సుజనా చౌదరి గుంటూరులోని ఓ బీజేపీ నేత ఇంటి వద్ద కాసేపు ఆగారు. ఈ సమయంలో వంశీ అక్కడకు వచ్చి సుజనా చౌదరిని కలిశారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత... ఇద్దరూ కలిసి ఒకే కారులో ఒంగోలుకు బయల్దేరారు. కొంత కాలం క్రితమే సుజనా చౌదరి టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు, టీడీపీపై కొంత కాలంగా వంశీ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వీరిద్దరి భేటీ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టైంది. వంశీ పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

Sujana Chowdary
Vallabhaneni Vamsi
Telugudesam
BJP
  • Loading...

More Telugu News