Krishna River: కృష్ణమ్మ ఉగ్రరూపం... విజయవాడలో నీట మునిగిన రామలింగేశ్వర నగర్!

  • కరకట్ట గోడకు లీకులు
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • వరద మరింతగా పెరిగే అవకాశం

ఎగువ నుంచి వస్తున్న వరదతో విజయవాడ వద్ద కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ఈ ఉదయం ఆరున్నర లక్షలకు పైగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు ప్రవహిస్తూ ఉండటంతో, విజయవాడ, రామలింగేశ్వర నగర్ లోకి నీరు ప్రవేశించింది. దీంతో వందలాది పేదల ఇళ్లు నీట మునిగాయి. వరద నీరు నగరంలోకి ప్రవేశించకుండా ఏర్పాటు చేసిన గోడకు లీకులు ఏర్పడటం కారణంగానే నీరు వచ్చిందని అధికారులు తెలిపారు.

 వరద తగ్గిన తరువాత మాత్రమే మరమ్మతులకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈలోగా నీటిని తోడివేసేందుకు భారీ మోటార్లతో కూడిన యంత్రాలను వినియోగిస్తామని తెలిపారు. కాగా, ఇళ్లలోకి నీరు రావడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరద మరింతగా పెరగవచ్చన్న అంచనాలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రేపటికి ప్రకాశం బ్యారేజ్ కి 8 లక్షల క్యూసెక్కుల వరకూ వరద రావచ్చని అంచనా.

Krishna River
Flood
Prakasam Barrage
Vijayawada
  • Loading...

More Telugu News