CPI Narayana: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం.. 26 నుంచి కూనంనేని నిరాహార దీక్ష
- హుజూర్నగర్ గెలుపుతో కేసీఆర్‌లో అహంభావం పెరిగింది: తమ్మినేని
- సంఘాల మద్దతుతోనే సీఎం అయిన సంగతిని గుర్తుంచుకోవాలి
- గెలిచింది ఒక్క ఉప ఎన్నికలోనేనన్న నారాయణ
సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ నెల 26 నుంచి ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. కార్మికుల ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం కోసమే కూనంనేని ఈ దీక్ష చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో కేసీఆర్‌లో అహంభావం పెరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం విమర్శించారు. సంఘాల మద్దతుతో ముఖ్యమంత్రి అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కేసీఆర్‌కు హితవు పలికారు. ఒక్క ఉప ఎన్నికలో విజయం సాధించినంత మాత్రాన ఇంత అహంభావం పనికిరాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.