Kangana: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

  • తన కథనే సినిమా తీస్తానంటున్న నటి
  • 'అసురన్' తెలుగు రీమేక్ లో వెంకటేశ్ 
  • వచ్చే నెలలో వస్తున్న 'జార్జిరెడ్డి'

*  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్ త్వరలో తన బయోపిక్ ను కూడా చేస్తానని అంటోంది. 'నా జీవితంలో జరిగిన సంఘటనలతో సినిమా తీస్తాను. ఒకవేళ సినిమా తీయడం కుదరకపోతే కనుక ఆ విశేషాలతో కచ్చితంగా పుస్తకమైనా రాస్తాను'  అని చెప్పింది కంగన.
 *  తమిళనాట ఇటీవల ఘనవిజయం సాధించిన 'అసురన్' చిత్రం తెలుగు రీమేక్ లో ఎవరు నటిస్తారా? అన్న సస్పెన్స్ వీడిపోయింది. సీనియర్ నటుడు వెంకటేశ్ ఈ రీమేక్ లో నటించనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ నిర్మాత కలైపులి ఎస్ థానుతో కలసి సురేశ్ బాబు ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. దర్శకుడు ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారు.
*  ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు దివంగత జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన 'జార్జిరెడ్డి' చిత్రాన్ని వచ్చే నెల 22న విడుదల చేయనున్నారు. ఇందులో జార్జిరెడ్డి పాత్రలో శాండీ నటించగా, జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు.   

Kangana
Venkatesh
Asuran
Suresh Babu
  • Loading...

More Telugu News