Bigg Boss: తన ప్రేమ రహస్యాలను బయటపెట్టిన శ్రీముఖి.. చనిపోదాం అనుకుందట!

  • అంతా బాగున్న సమయంలో డిస్టర్బ్ అయింది
  • ఆ తర్వాత రిలేషన్ పూర్తిగా దెబ్బతింది
  • అదో అగ్లీ బ్రేకప్

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌-3లో గట్టిపోటీదారుగా ఉన్న శ్రీముఖి తన ప్రేమకు సంబంధించిన రహస్యాలను బయటపెట్టేసింది. లవ్ ఫెయిల్యూర్ కావడంతో ఒకానొక దశలో చనిపోదామనుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో మిగిలిన పోటీదారుల్లో ఒక్కొక్కరు తమ లైఫ్ సీక్రెట్స్‌ను బయటపెట్టారు. ఈ క్రమంలో శ్రీముఖి తన లవ్‌బ్రేకప్‌ను బయటపెట్టింది.

తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటి వరకు తానెక్కడా బయటపెట్టలేదన్న శ్రీముఖి మాట్లాడుతూ.. తనకు రిలేషన్‌షిప్ ఉందని, దానినెప్పుడూ బయటపెట్టలేదని పేర్కొంది. అతడితో అంతా ఓకే అనుకున్న సమయంలో తమ రిలేషన్‌షిప్‌లో అనుకోకుండా కుదుపులు వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత తమ రిలేషన్ పూర్తిగా దెబ్బతిందని వివరించింది. అది తన జీవితంలో ‘అగ్లీ బ్రేకప్’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో చనిపోదామన్న ఆలోచన కూడా వచ్చిందని శ్రీముఖి పేర్కొంది.

Bigg Boss
sree mukhi
star maa
love break up
  • Loading...

More Telugu News