Suryapet District: ఇది ఆషామాషీ గెలుపు కాదు..హుజూర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్

  • ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారు
  • ఈ గెలుపు ప్రభుత్వానికి ఓ టానిక్ లాంటిది
  • ఎల్లుండి హుజూర్ నగర్ లో కృతజ్ఞత సభ నిర్వహిస్తాం

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు అద్భుత విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ గెలుపు ఆషామాషీ గెలుపు కాదని, ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారని అన్నారు. ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ఈ గెలుపు ఓ టానిక్ లాంటిదని, ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలకు ముందు నిర్వహించాల్సిన సభకు తాను హాజరుకాలేకపోయానని గుర్తుచేసుకున్నారు. ఇంత అద్భుత విజయాన్ని అందించిన ప్రజల కోసం ఎల్లుండి హుజూర్ నగర్ లో కృతజ్ఞత సభ నిర్వహిస్తామని అన్నారు.

Suryapet District
Huzurunagar
cm
kcr
TRS
  • Loading...

More Telugu News