Sujana Chowdary: గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే జగన్ ప్రభుత్వం కూడా చెబుతోంది: సుజనా చౌదరి

  • జగన్ ఇప్పట్నించే ఓట్ల రాజకీయం ప్రారంభించారన్న సుజనా
  • అమిత్ షాకు జగన్ ఇచ్చిన వినతిపత్రం నిరాధారమైందంటూ వ్యాఖ్యలు
  • పోలవరంపై కేందం అసంతృప్తితో ఉందని వెల్లడి

రెవెన్యూ లోటుపై గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా చెబుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జగన్ ఇచ్చిన వినతిపత్రం నిరాధారమైనదని అన్నారు. జగన్ ఇప్పటినుంచే ఓట్ల రాజకీయం ప్రారంభించారని అర్థమవుతోందని విమర్శించారు. పోలవరం పరిణామాలపై కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తిగా ఉందని సుజనా తెలిపారు. అద్దె ఇంటికి, సొంత ఇంటికి ఒకే టెండరు పిలిచినట్టు పోలవరం టెండర్లు పిలిచారని వ్యాఖ్యానించారు. రాజధానిలో రూ.9 వేల కోట్ల పనులు జరిగితే రూ.30 వేల కోట్ల దుబారా ఎలా సాధ్యమని అడిగారు.

Sujana Chowdary
Jagan
Amit Shah
Andhra Pradesh
Chandrababu
  • Loading...

More Telugu News