Suryapet District: పద్మావతి ఓటమితో పార్టీ గుణపాఠం నేర్చుకోవాలి: వీహెచ్

  • ఈ ఉపఎన్నికపై సమీక్ష జరగాలి
  • సమీక్ష జరిగే వరకూ పీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా చేయొద్దు
  • రేవంత్ రెడ్డి దగ్గర పైసలున్నాయని దూకుడు పెంచారు

హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావడంపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) స్పందించారు. హుజూర్ నగర్ లో తమ అభ్యర్థి పద్మావతిరెడ్డి ఓటమితో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉపఎన్నికపై సమీక్ష జరగాలని, సమీక్ష జరిగే వరకూ ఉత్తమ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయొద్దని సూచించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఉన్నాయని దూకుడు పెంచారని అన్నారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కు లాభం అని ప్రచారం చేశారని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలమెక్కిస్తున్నారని పార్టీ తీరుపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పీసీసీ అధ్యక్ష పదవి రేస్ లో నేను ఉన్నాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా’ అని వీహెచ్ స్పష్టం చేశారు.

Suryapet District
Huzurunagar
congress
VH
  • Loading...

More Telugu News