kcr: కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్
- ఎన్నికల ఫలితం నేపథ్యంలో కేసీఆర్ మీడియా సమావేశం
- గెలుపు దిశగా దూసుకుపోతున్న సైదిరెడ్డి
- సంబరాల్లో మునిగిన టీఆర్ఎస్ శ్రేణులు
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఫలితాలు వెల్లడికాగానే సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. తెలంగాణ భవన్ కు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. కాగా, 14వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 25,999 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపొందడంతో ఆ పార్టీ నేతలు ఆ నియోజకవ వర్గంలో రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహల్లో మునిగితేలారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగాయి. తన భార్య పద్మావతిని ఆయన బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ పై టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీపై ఆర్టీసి సమ్మె ప్రభావం అంతగా పడలేదు.