Pawan Kalyan: జన సైనికురాలు స్వాతిని అసభ్యంగా దూషిస్తుంటే పోలీసులకు పట్టదా?: పవన్ కల్యాణ్ ఆగ్రహం

  • అనంత స్వాతి అనే కార్యకర్తపై పోస్టులు
  • పోలీసులు స్పందించడం లేదన్న పవన్
  • అందరికీ శిక్ష తప్పదని హెచ్చరిక

సోషల్ మీడియాలో ఓ ఆడబిడ్డపై అసభ్య పోస్టులు పెడితే పోలీసులు స్పందించడం లేదంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కార్యకర్త అనంత స్వాతి అనే అమ్మాయిని అసభ్యంగా దూషిస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ప్రకటనను ఉంచిన ఆయన, సోషల్ మీడియా విషయంలో చట్టాలు సరిగ్గా లేకనే, కొందరు అసభ్య పోస్టులతో పేట్రేగుతున్నారని అన్నారు.

త్వరలో సామాజిక మాధ్యమాల నిబంధనలు కఠినతరం కానున్నాయని, అప్పుడు వారందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు. వైసీపీ నేతలపై చిన్న పోస్ట్ పెడితేనే వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందంటూ, కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని అన్నారు. స్వాతి గురించి నీచంగా పోస్టులు పెడుతూ, కులం పేరుతో దూషిస్తుంటే పోలీసులు స్పందించడం లేదని, ఆడపిల్లలను కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. స్వాతికి అండగా పార్టీ లీగల్ సెల్ నిలుస్తుందని హామీ ఇచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News