Kiran Bedi: సీఎంకు జరిమానా విధించండి: డీజీపీని ఆదేశించిన కిరణ్ బేడీ

  • హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన నారాయణస్వామి
  • రూల్స్ పాటించని సీఎంపై విమర్శలు
  • ట్రాఫిక్ రూల్స్ అందరికీ ఒకటేనన్న కిరణ్ బేడీ

ముఖ్యమంత్రికైనా, సామాన్యుడికైనా ట్రాఫిక్ రూల్స్ ఒకటేనని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన ముఖ్యమంత్రి నారాయణస్వామికి జరిమానా విధించాలంటూ డీజీపీని ఆదేశించారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే, ఇటీవల జరిగిన ఓ ఎన్నికల ర్యాలీ సందర్భంగా నారాయణస్వామి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ పెట్టుకోకుండా ఆయన బైక్ నడిపారు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రాఫిక్ రూల్స్ సామాన్యులకు మాత్రమేనా? ముఖ్యమంత్రికి వర్తించవా? అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో సీఎంకు జరిమానా విధించాలని కిరణ్ బేడీ ఆదేశించారు. మరోవైపు, కిరణ్ బేడీ, నారాయణస్వామి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఇద్దరూ పరస్పరం విమర్శలను గుప్పించుకున్నారు.

Kiran Bedi
Narayanaswamy
Traffic Rule Violation
  • Loading...

More Telugu News