Huzur Nagar: ఆధిక్యం 11 వేలు... హుజూర్ నగర్ లో గెలుపు దిశగా పరిగెడుతున్న టీఆర్ఎస్!

  • 11 వేల ఓట్ల మెజారిటీలో సైదిరెడ్డి
  • అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యం   
  • అధికార పార్టీవైపు హుజూర్ నగర్ ఓటర్ మొగ్గు

హుజూర్ నగర్ కు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ లో ఐదవ రౌండ్ ముగిసిన తరువాత అధికార టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిని పద్మావతిపై 11 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన సైదిరెడ్డి, అన్ని రౌండ్లలో మెజారిటీని సాధించడం గమనార్హం. ఈ నియోజకవర్గ ఎన్నికను అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయన్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలూ హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లు, ఈ దఫా టీఆర్ఎస్ వైపు నిలవడం గమనార్హం.

Huzur Nagar
TRS
Congress
Saidireddy
  • Loading...

More Telugu News