Bandla Ganesh: ఓ కేసులో విచారణకు వస్తే, మరో కేసులో అరెస్ట్... నేడు కోర్టుకు బండ్ల గణేశ్!

  • పీవీపీ వద్ద డబ్బు తీసుకుని ఎగ్గొట్టినట్టు కేసు
  • ఐదేళ్ల క్రితం కడప వ్యాపారికి డబ్బు ఎగ్గొట్టినట్టు మరోకేసు
  • జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చిన గణేశ్ ను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు

'టెంపర్' సినిమా నిమిత్తం నిర్మాత పొట్లూరి వరప్రసాద్ వద్ద డబ్బులు తీసుకుని, తిరిగి చెల్లించలేదన్న కేసులో పోలీసుల విచారణకు వచ్చిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ను, పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. ఐదేళ్ల క్రితం 2014, అక్టోబర్‌ 1న కడప ప్రాంతానికి చెందిన మహేశ్‌ అనే వ్యాపారి నుంచి రూ.10 లక్షలు అప్పు తీసుకుని, తిరిగి ఇవ్వలేదన్న కేసు ఆయనపై నమోదు కాగా, ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చూపించారు.

తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని సదరు వ్యాపారి కడపలో కేసు పెట్టగా, స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గతనెల 18న అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు. గణేశ్ లొంగక పోవడంతో కడప పోలీసులు ఓ మారు హైదరాబాద్ కు వచ్చి, అతని ఆచూకీ లభించక తిరిగి వెళ్లారు. గణేశ్ పై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ వివరాలను కడప పోలీసులు హైదరాబాద్ పోలీసులకు అందించారు. దీంతో నిన్న జూబ్లీహిల్స్ స్టేషన్ కు గణేశ్ రాగా, బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు బండ్ల గణేశ్ ను తొలుత ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు జరిపి, ఆపై కోర్టుకు తరలించనున్నామని అధికారులు తెలిపారు.

Bandla Ganesh
Arrest
PVP
Police
  • Loading...

More Telugu News