Bejawada Obulreddy: అనారోగ్యంతో కన్నుమూసిన టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు ఓబుల్‌రెడ్డి

  • ఇటీవలే కలిసి పరామర్శించిన చంద్రబాబు
  • రైతు సమస్యలపై పోరాడిన నేతగా ఓబుల్‌రెడ్డికి గుర్తింపు
  • నివాళులర్పించిన సోమిరెడ్డి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన బెజవాడ ఓబుల్‌రెడ్డి నిన్న కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత అయిన ఓబుల్‌రెడ్డిని అధినేత చంద్రబాబు ఇటీవలే కలిసి పరామర్శించారు.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతు సమస్యలపై పోరాడిన నేతగా ఓబుల్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఆయన సోదరుడు బెజవాడ పాపిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఓబుల్‌రెడ్డి మృతి విషయం తెలిసిన పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్‌రెడ్డి ఓబుల్‌రెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Bejawada Obulreddy
Telugudesam
Vijayawada
somireddy
  • Loading...

More Telugu News