producer: పీవీపీని బెదిరించిన కేసులో సినీ నిర్మాత బండ్ల గణేశ్ అరెస్టు!

  • వైసీపీ నేత, నిర్మాత పీవీపీని బెదిరించిన కేసు
  • బండ్ల గణేశ్ ను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
  • పోలీస్ స్టేషన్ కు తరలింపు

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత, నిర్మాత పీవీపీని తన అనుచరులతో కలిసి బెదిరించిన కేసులో బండ్ల గణేశ్ ను హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన్ని పిలిచిన పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు.

అదే సమయంలో, గతంలో ఆయనపై నమోదైన కేసుల విషయంలో కూడా పోలీసులు విచారించినట్టు సమాచారం. ఆయనపై 420, 448 తదితర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, టెంపర్ సినిమా కోసం బండ్ల గణేశ్ కు పీవీపీ రూ.30 కోట్లు ఫైనాన్స్ చేసినట్టు, తీసుకున్న డబ్బులో రూ.7 కోట్లు తిరిగి చెల్లించనట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తాయి.

producer
Bandla Ganesh
YSRCP
pvp
  • Loading...

More Telugu News