Jagan: బోటు ప్రమాదంలో ఏ1 జగన్.. ఏ2 అవంతి శ్రీనివాస్: పంచుమర్తి అనురాధ

  • జగన్ పట్టించుకోకపోవడం వల్లే బోటు వెలికితీత ఆలస్యమైంది
  • ప్రమాదంపై విచారణ ఏమైందో అర్థం కావడం లేదు
  • మృతుల కుటుంబాలను ప్రభుత్వ పెద్దలు ఇంత వరకు పరామర్శించలేదు

గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం వెలికి తీసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ స్పందిస్తూ, ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం వల్లే బోటు వెలికితీత ఆలస్యమయిందని అన్నారు. బోటు ప్రమాదంపై విచారణ ఏమైందో కూడా అర్థం కావడం లేదని విమర్శించారు. ఈ ప్రమాదంలో ఏ1గా జగన్, ఏ2గా మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్లను చేర్చాలని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పెద్దలు ఇంత వరకు పరామర్శించలేదని చెప్పారు. అసలు ఎంత మంది చనిపోయారనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందా? అని ప్రశ్నించారు.

Jagan
Panchumarthi Anuradha
Boat Accident
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News