Andhra Pradesh: ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా?: నక్కా ఆనందబాబు

  • టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ యాత్ర
  • ఈ యాత్రను అడ్డుకున్న పోలీసులు
  • వర్లపై పోలీస్ సంఘం అధికారుల వ్యాఖ్యలు సరికాదు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విజయవాడలో దళితుల ఆత్మగౌరవ యాత్ర ఈరోజు నిర్వహించారు. ఈ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించిన ప్రతిపక్షాలు, మీడియా గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్ల రామయ్యపై పోలీస్ అధికారుల సంఘం నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వర్ల రామయ్యపై రాజకీయ నేతల తరహాలో వ్యాఖ్యలు గుప్పించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
Telugudesam
Nakka Anand Babu
  • Loading...

More Telugu News