boat: కచ్చులూరు బోటు ప్రమాదంలో కొన్ని మృతదేహాల గుర్తింపు

  • రాజమహేంద్రవరం ఆసుపత్రికి మృతుల కుటుంబ సభ్యులు
  • డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు 
  • వరంగల్ కు చెందిన ఇద్దరి మృతదేహాల గుర్తింపు

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం విజయవంతంగా బయటకు తీసిన విషయం తెలిసిందే. అందులో కొందరి మృతదేహాలు బయటపడ్డాయి. ఈ మృతదేహాలు ఎవరివన్న విషయంపై చాలావరకు స్పష్టత వచ్చింది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకుని వాటిని గుర్తించారు.

డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. అలాగే, బోటు అసిస్టెంట్ డ్రైవర్ పతాబత్తుల సత్యనారాయణ, నల్గొండకు చెందిన సురభి రవీందర్, వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులు కొమ్ముల రవి, బసికె ధర్మరాజు మృతదేహాలను గుర్తించారు. మరికొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. 

boat
East Godavari District
  • Loading...

More Telugu News