Jagan: ఎన్నో ట్రావెల్స్ బస్సులున్నా.. జగన్ కు మా బస్సులే కనిపిస్తున్నాయి: జేసీ దివాకర్ రెడ్డి

  • జగన్ పాలనకు 100కు 150 మార్కులు వేయాలి
  • అయితే పాలనలో మాత్రం కింద, మీద పడుతున్నారు
  • మావి 31 బస్సులు సీజ్ చేశారు

జగన్ పాలనకు 100 మార్కులకు గాను 150 మార్కులు వేయాలని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ పాలన చాలా జనరంజకంగా సాగుతోందని అన్నారు. అయితే, పాలనలో మాత్రం కింద, మీద పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ బస్సులున్నప్పటికీ... జగన్ కు తమ బస్సులే కనిపిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమవి 31 బస్సులు సీజ్ చేశారని చెప్పారు.

70 ఏళ్ల నుంచి ట్రావెల్స్ రంగంలో ఉన్నామని... చిన్నచిన్న పొరపాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్ కైనా సహజమేనని చెప్పారు. తమ బస్సులను మాత్రమే బూతద్దంలో చూస్తూ సీజ్ చేస్తున్నారని... ఫైన్ లతో పోయేదానికి సీజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ విషయంపై కోర్టుకు వెళతామని చెప్పారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తమ అబ్బాయేనని అన్నారు.

Jagan
JC Diwakar Reddy
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News