Revanth Reddy: రేవంత్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టిన హైదరాబాద్ పోలీసులు!

  • రెండు రోజుల క్రితం ప్రగతి భవన్ ముట్టడి
  • అడ్డుకున్న పోలీసులను తోసేసిన రేవంత్
  • పలు సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదు

రెండు రోజుల క్రితం జరిగిన విపక్షాల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో, పోలీసుల కళ్లుగప్పి బైక్ పై వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఆయన్ని తోసివేశారన్న అభియోగాలతో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది.

కాగా, సోమవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వేళ, తనను అడ్డుకున్న ఎస్ఐ నవీన్ రెడ్డిని రేవంత్ పక్కకు తోసేశారు. ఈ ఘటనలో నవీన్ రెడ్డికి గాయాలు అయ్యాయి. దీంతో ఆయన ఫిర్యాదు చేశారు. రేవంత్ పై ఐపీసీలోని సెక్షన్ 341, 332, 353ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు.

Revanth Reddy
Hyderabad
Police
Pragathi Bhavan
  • Loading...

More Telugu News