Sourav Ganguly: 'దాదా'గిరి షురూ.. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన గంగూలీ

  • ఇండియన్ క్రికెట్ బాస్ గా గంగూలీ
  • బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన రెండో క్రికెటర్ గంగూలీ
  • కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించిన అమిత్ షా కుమారుడు

భారత క్రికెట్లో దాదాగిరి ప్రారంభమైంది. తన నాయకత్వంలో టీమిండియాను ఉన్నత శిఖరాలకు చేర్చిన సౌరవ్ గంగూలీ... బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన క్రికెటర్లలో రెండో వ్యక్తిగా గంగూలీ ఘనత సాధించారు. ఇంతకు ముందు విజయనగరం మహారాజా బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అరుణ్ ధుమాల్ ట్రెజరర్ గా బాధ్యతలను చేపట్టారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడే అరుణ్ ధుమాల్. గంగూలీతో పాటు వీరిద్దరూ కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.

Sourav Ganguly
BCCI
President
  • Loading...

More Telugu News