Jagan: ముందు మీరు కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి గెలవండి: చంద్రబాబుకు విజయ సాయిరెడ్డి సవాల్

  • ప్రజలు మళ్లీ తననే కోరుకుంటున్నారని చంద్రబాబు అంటున్నారు
  • ప్రజలంటే కుల మీడియా అధిపతులు, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదు 
  • నాలుగు నెలల్లోనే జగన్ 80 శాతం హామీలను నెరవేర్చారు

నాలుగు నెలల్లోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై విసుగొచ్చిందని, ప్రజలు ఇప్పుడు మళ్లీ తననే సీఎంగా కోరుకుంటున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

 'ప్రజలు మళ్లీ తననే  కోరుకుంటున్నారట. ప్రజలంటే కుల మీడియా అధిపతులు, మీ బంధుగణం, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదు చంద్రబాబు గారూ. 13 జిల్లాల్లోని ఐదు కోట్ల మందిని ప్రజలు అని అంటారు. ముందు మీరు కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి గెలవండి. నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తున్నారని భావిస్తారంతా' అని ట్వీట్ చేశారు.

'వంశ పారంపర్యం అర్చకత్వానికి ఆమోదం తెలపడం ద్వారా ఆలయాలపైన ఆధారపడి జీవిస్తున్న వేలాది అర్చక కుటుంబాలకు జగన్ భరోసా కల్పించారు. గతంలో కూల్చేసిన ఆలయాలు, ప్రార్థనా స్థలాలన్నిటినీ పునర్నిర్మించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. నాలుగు నెలల్లోనే జగన్ 80 శాతం హామీలను నెరవేర్చారు' అని విజయ సాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.

Jagan
YSRCP
Chandrababu
vijaya saireddy
  • Loading...

More Telugu News