Virat Kohli: ఇంతటి బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఏ జట్టులోనూ లేదు: టీమిండియా కెప్టెన్ కోహ్లీ

  • దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ లో భారత ఆటగాళ్ల సమష్టి కృషి వల్లే గెలుపు
  • టీమిండియా పేస్‌ బౌలర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు
  • రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా విజయవంతమవడం టీమిండియాకు అదనపు బలం

టీమిండియాలో ఉన్న బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌.. ఏ జట్టులోనూ లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ లో భారత ఆటగాళ్ల సమష్టి కృషి వల్లే గెలుపొందామని తెలిపాడు. స్పిన్‌ బౌలింగ్‌ ఎప్పటికీ భారత బలమని అన్నాడు.

టీమిండియా పేస్‌ బౌలర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారని కోహ్లీ చెప్పాడు. రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా విజయవంతమవడం టీమిండియా జట్టుకు అదనపు బలమని ఆయన అన్నాడు. మయాంక్‌కు రోహిత్ సరైన జోడీ అని తెలిపాడు. రహానే అద్భుతంగా ఆడాడని, ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడని కోహ్లీ అన్నాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్ మెన్ జడేజా, అశ్విన్‌, సాహా కూడా అద్భుతంగా ఆడుతున్నారని చెప్పాడు. ఫీల్డింగ్‌లో టీమిండియా ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నాడు. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. చివరి టెస్టులో ఇన్నింగ్స్‌, 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Virat Kohli
Cricket
India
  • Loading...

More Telugu News