Akhilapriya: హైదరాబాద్ లోని అఖిలప్రియ ఇంటికి వచ్చిన ఏపీ పోలీసులు... తీవ్ర వాగ్వాదం!

  • ఆళ్లగడ్డ నుంచి వచ్చిన పోలీసు బృందం
  • పక్కింట్లోకి వెళ్లి, గోడ దూకి వచ్చారన్న అఖిలప్రియ
  • పోలీసులు సామాన్లు ధ్వంసం చేశారని ఆరోపణ

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ లోని ఆమె ఇంటికి, ఏపీ పోలీసులు వచ్చిన వేళ, కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆళ్లగడ్డకు చెందిన పోలీసులు, హైదరాబాద్ చేరుకుని అఖిల ప్రియ ఇంటి వద్దకు వెళ్లారు. ఏదైనా సెర్చ్ వారెంట్ ఉందా? అని అడిగిన అఖిల ప్రియ, వారెంట్ లేకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసుల వైఖరిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అఖిల ప్రియ, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తమ పక్కింట్లోకి వెళ్లి, అక్కడి నుంచి గోడ దూకి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపించిన ఆమె, ఇంట్లోని సామాన్లను కూడా వారు ధ్వంసం చేశారని, నానా హంగామా సృష్టించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తూ, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, దీనిపై తాము కూడా పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు.

Akhilapriya
Bhargav Ram
Police
Hyderabad
  • Error fetching data: Network response was not ok

More Telugu News