Charan Raj: ఆ ఫ్రెండ్ అవమానించడం వల్లనే ఆర్టిస్టునయ్యాను: నటుడు చరణ్ రాజ్
- మొదటి నుంచి డాన్స్ అంటే ఇష్టం
- కన్నడలో మొదటి సినిమా చేశాను
- వరుస హిట్లు పడటం అదృష్టమన్న చరణ్ రాజ్
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నటుడు చరణ్ రాజ్ మాట్లాడుతూ, తన స్కూల్ డేస్ లో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. మొదటి నుంచి కూడా నేను పాటలు బాగా పాడేవాడిని .. డాన్స్ బాగా చేసేవాడిని. దాంతో సినిమాల్లోకి వెళ్లొచ్చు గదా? అని ఒక స్నేహితుడు అన్నాడు. అక్కడే వున్న గురురాజ్ భట్ అనే మరో స్నేహితుడు, 'నీ ముఖం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావారా?' అని నాతో అన్నాడు.
నిజంగానే అప్పట్లో నేను సన్నగా ఉండేవాడిని. అయినా అతనలా ఎద్దేవా చేయడంతో నాలో పంతం పెరిగిపోయి .. 'ఛాలెంజ్ చేస్తున్నాను .. ఎప్పటికైనా నేను సినిమా ఆర్టిస్టునవుతాను' అని అన్నాను. అలా ఛాలెంజ్ చేసిన ఏడెనిమిది సంవత్సరాలకే నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. కన్నడలో నేను చేసిన సినిమాలు వరుస హిట్లు కొట్టాయి. 7 సినిమాల తరువాత నా క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తరువాత ఆ గురురాజ్ భట్ నన్ను కలుసుకోవడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.