Shalini Pandey: వచ్చే నెలలో పలకరించనున్న షాలినీ పాండే

  • షాలినీ పాండేకి ఊరటనిచ్చిన '118' సక్సెస్ 
  • త్వరలో రానున్న 'ఇద్దరి లోకం ఒకటే'
  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే కథ

తెలుగు తెరపై తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకున్న అతికొద్ది మంది కథానాయికలలో షాలినీ పాండే ఒకరు. ఈ హిట్ తో ఆమె తెలుగులో ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అంతా భావించారు. కానీ ఎందుకనో ఆశించిన స్థాయిలో ఈ అమ్మాయి అవకాశాలను అందుకోలేకపోయింది.

ఇటీవల వచ్చిన '118' చిత్రం విజయం మాత్రం ఆమెకి కొంతవరకూ ఉపశమనాన్ని కలిగించింది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'ఇద్దరి లోకం ఒకటే' వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ జోడీగా చేసిన ఈ సినిమాపైనే ఆమె ఆశలు పెట్టుకుంది. జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆమె వుంది. ఈ సినిమాతో ఆమె ఆశ నెరవేరుతుందేమో చూడాలి మరి.

Shalini Pandey
  • Loading...

More Telugu News