Devineni Avinash: అంతా వైసీపీ మైండ్ గేమ్... ప్రాణం పోయేవరకూ టీడీపీతోనే: దేవినేని అవినాశ్

  • అవినాశ్ పార్టీ మారుతారని వార్తలు
  • టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టీకరణ
  • బాబు నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని వ్యాఖ్య

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్, పార్టీ మారుతారని సోషల్ మీడియాతో పాటు, దినపత్రికల్లో వార్తలు హల్ చల్ చేస్తుండగా, అవినాశ్ స్పందించారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తన ప్రాణాలు పోయేంతవరకూ టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశమేదీ లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, వైసీపీ ఆడుతున్న మైండ్ గేమని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి నాయకత్వంలో పనిచేయడాన్ని తానెంతో గర్వంగా భావిస్తున్నానని, ఆయన అప్పగించిన విధులను నిర్వర్తించేందుకు కట్టుబడివున్నానని అన్నారు. దేవినేని అవినాశ్ వీడియోను మీరూ చూడవచ్చు.

Devineni Avinash
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News