Bangladesh: డిగ్రీ పట్టా కోసం... 8 మంది డూప్ లను తయారు చేసిన బంగ్లా ఎంపీ!

  • అవామీ లీగ్ ఎంపీ తమన్నా సుస్రత్
  • 13 పరీక్షలు రాసేందుకు డూప్ ల వినియోగం
  • విషయం బయటకు రావడంతో ఎంపీని సస్పెండ్ చేసిన వర్శిటీ

డిగ్రీ పట్టా కోసం బంగ్లాదేశ్‌ మహిళా ఎంపీ చేసిన పని, ఇప్పుడామెను చిక్కుల్లో పడేసింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ తమన్నా సుస్రత్, యూనివర్సిటీ పరీక్షలను తన తరఫున రాయించేందుకు తనలాగే కనిపించే 8 మంది డూప్ లను తయారు చేయించారు. వారితోనే పరీక్షలు రాయించారు. ఈ విషయాన్ని పసిగట్టిన మీడియా, సాక్ష్యాలతో సహా మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టడంతో యూనివర్సిటీ యాజమాన్యం సుస్రత్ ను బహిష్కరించింది.

కాగా, అవామీ లీగ్‌ పార్టీకి చెందిన తమన్నా నుస్రత్‌ బంగ్లాదేశ్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ విద్యను అభ్యసిస్తున్నారు. తాను రాయాల్సిన మొత్తం 13 సబ్జెకుల పరీక్షల కోసం తన మాదిరిగానే ఉన్న 8 మందిని ఆమె రంగంలోకి దించగా, 'నాగరిక్‌ టీవీ' అనే చానెల్‌ విషయాన్ని బయటపెట్టింది. ఈ డూప్ మహిళలు పరీక్షలు రాస్తుంటే, ఎంపీ అనుచరులు కాపలాగా ఉండటం గమనార్హం.

Bangladesh
Tamannah Susrut
University
Fake Identity
  • Loading...

More Telugu News