Pakistan: తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

  • ప్రమాదకరస్థాయికి పడిపోయిన ప్లేట్‌లెట్లు 
  • లాహోర్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలింపు
  • ఆసుపత్రి గదిని సబ్‌జైలుగా మార్చిన అధికారులు

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ప్లేట్‌లెట్లు ప్రమాదకరస్థాయికి పడిపోవడంతో వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు జైలు అధికారులు ఆయనను లాహోర్‌లోని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కార్యాలయం నుంచి నేరుగా లాహోర్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఆసుపత్రిని సందర్శించి నవాజ్‌ను పరామర్శించారు.

కాగా, అధికారులు ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన చికిత్స పొందుతున్న గదిని తాత్కాలిక సబ్‌జైలుగా ప్రకటించిన అధికారులు నవాజ్‌ను ఎవరూ కలవకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పనామా పత్రాల కుంభకోణం కేసులో నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లాహోర్ కోర్టులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Pakistan
lahore
Nawaz Sharif
hospital
  • Loading...

More Telugu News