Prince Harry: మా మార్గాలు వేరైనా సోదరులుగా ఒక్కటే.. ప్రిన్స్ హ్యారీ

  • ఇటీవల ప్రిన్స్ విలియమ్ తో విభేదాలు ఏర్పడ్డ మాట నిజమే
  • విలియమ్ నన్ను ఎంతో అభిమానిస్తారు
  • మా సోదర బంధం ఎప్పటికీ కొనసాగుతుంది

బ్రిటన్ రాకుమారుల మధ్య ఇటీవల విభేదాలు చోటు చేసుకున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ప్రిన్స్ హ్యారీ స్పందిస్తూ, అవి నిజమేనని ఒప్పుకున్నారు. ఇటీవల  హ్యారీ దక్షిణాఫ్రికాలో భార్య మేఘన్ మార్కెల్ తో కలిసి పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘ప్రస్తుతం మేము వేరు వేరు మార్గాల్లో ఉన్నాము.  మా సోదర బంధంలో..  ఇద్దరమూ మంచి, చెడు రోజులను చవిచూశాము’ అని ప్రిన్స్ హ్యారీ అన్నారు. ఇటీవల తమ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయన్న పుకార్లపై హ్యారీ స్పందిస్తూ.. మాలో చీలిక నిజమే. మేము సోదరులము. ఎప్పటికీ సోదరులుగానే కొనసాగుతాం. ప్రస్తుతం మేము వేరు వేరు మార్గాల్లో ఉన్న మాట నిజమే. అయితే నేను విలియమ్స్ కోసం దారిలో వేచి ఉంటా.. నాకు తెలుసు, అతను కూడా నాకోసం వేచివుంటారు’ అన్నారు.

మరోవైపు మేఘన్ మార్కెల్, ప్రిన్స్ విలియమ్స్ భార్య కాటె మిడిల్ టన్ మధ్య పొరపొచ్చాలు వచ్చాయన్న పుకార్లు వస్తున్నాయి. అమెరికాలో మోడల్ గా ఉన్న 38 ఏళ్ల మేఘన్ ప్రిన్స్ హ్యారీని వివాహం చేసుకోవడం బ్రిటన్ రాజకుటుంబానికి ఇష్టం లేదని.. మరోవైపు మేఘన్, కాటె మిడిల్ టన్ మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయని.. మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు ఈ వార్తలను ఖండిస్తూ.. బ్రిటీష్ టాబ్లాయిడ్ ‘ది మెయిల్ ఆన్ సండే’ పై చట్ట ప్రకారం చర్యలను కూడా ప్రారంభించినట్టు తెలిపారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News