Budda Venkanna: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే ప్రజలకు నవరత్న ఆయిల్ రాసారా శకుని మామా?: బుద్ధా వెంకన్న సెటైర్లు

  • విజయసాయిరెడ్డిపై బుద్ధా ట్వీట్లు
  • రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టేశారంటూ వ్యాఖ్యలు
  • చర్చకు సిద్ధమా? అంటూ సవాల్

వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నేత బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. తాజాగా బుద్ధా వెంకన్న మరికొన్ని వ్యాఖ్యలతో వరుస ట్వీట్లు చేశారు. "రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే ప్రజలకు నవరత్న తైలం రాసారా శకుని మామా?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

"అత్యధిక లోక్ సభ స్థానాల్లో గెలిపిస్తే మోదీ మెడలు వంచుతాం, కేంద్రాన్ని కడిగి పారేసి రాష్ట్ర ఖజానా నింపుతామని నువ్వు, మీ తుగ్లక్ అన్నారుగా! తీరా మీకు 22 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్ర హక్కుల కోసం పోరాడకుండా, కేసుల మాఫీ కోసం ఏపీ హక్కుల్ని తాకట్టు పెట్టేశారు కదా శకుని మామా! దానికితోడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితీ, అప్పులూ అంటూ మంగళారం కబుర్లొకటి!" అంటూ సెటైర్ వేశారు.

మడమ తిప్పాం, మాట తప్పాం అని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, "మహామేత హయాంలో చేసిన అప్పులు, చంద్రబాబు సృష్టించిన సంపదపై నేను చర్చకు సిద్ధం, మరి నువ్వు సిద్ధమా శకుని మామా?" అంటూ సవాల్ విసిరారు.

Budda Venkanna
Telugudesam
Vijay Sai Reddy
Jagan
YSRCP
  • Loading...

More Telugu News