Sachin Tendulkar: ఓటు హక్కును వినియోగించుకున్న సచిన్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-0da09cf3673ac20d56fecda3f76bbfb69d80adf4.jpg)
- ముంబైలోని బాంద్రాలో ఓటు వేసిన సచిన్, అంజలి, అర్జున్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన సచిన్
- సమాజానికి మంచి చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపు
మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న పోలింగ్ లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య అంజలి, కుమారుడు అర్జున్ కూడా ఓటు వేశారు. ముంబైలోని బాంద్రా (వెస్ట్)లోని పోలింగ్ బూత్ లో వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో సచిన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి బయటకు వచ్చి, ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భవిష్యత్తును మార్చగలిగే సత్తా ఓటర్లకు ఉందని చెప్పారు. సమాజానికి మంచి చేస్తారని ఎవరినైతే మీరు నమ్ముతారో, వారికి ఓటు వేయండని పిలుపునిచ్చారు. అర్హులైన వారిని ఎన్నుకోవాలని కోరారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-a838be372aa907aada50a7b9be4d307a66bc0def.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-542981ca10bf2e2c9cde74d42860dda2b466c557.jpg)