Cricket: రాంచీ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్.. ఫాలో ఆన్ ఇచ్చిన కొహ్లీ సేన

  • టీమిండియా బౌలర్ల ధాటికి కుప్పకూలిన బ్యాట్స్ మెన్
  • ఉమేశ్ యాదవ్ కి మూడు వికెట్లు
  • 62 పరుగులు చేసిన హంజా  

రాంచీలో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ 162 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఎల్గర్‌ (0) , డికాక్‌ (4),  డుప్లెసిస్ ( 1) ఔటైన విషయం తెలిసిందే. అనంతరం హంజా (79 బంతుల్లో 62 పరుగులు), బవుమా (72 బంతుల్లో 32), క్లాసేన్ (10 బంతుల్లో 6), పైడ్త్ (14 బంతుల్లో 4), రబాడా (6 బంతుల్లో 0), లిండె (81 బంతుల్లో 37), నోర్ట్ జె (55 బంతుల్లో 4), ఎన్గిడి (0, నాటౌట్) వెనుదిరిగారు.

టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కి మూడు వికెట్లు, షమీ, జడేజా, నదీమ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. టీమిండియా నిన్న 116.3 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 497 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 335 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాకు కోహ్లీ సేన ఫాలో ఆన్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News