Congress: అరెస్టులతో ఆందోళనలను ఆపలేరు: కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ

  • సీఎం కేసీఆర్‌ అహంకారంతో వ్యవహరిస్తున్నారు
  • తానో నియంతను అనుకుంటున్నారు
  • కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదు

కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు ఆదేశించినా, దానిని సైతం ధిక్కరించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తానో నియంతను అన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఆయన అహంకారం ఏ స్థాయిలో ఉందో ఆర్టీసీ సమ్మెతో బయటపడిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 ఆర్టీసీ ఉద్యమం ఇప్పటికే తీవ్ర స్థాయికి చేరిందని, అరెస్టులతో దాన్ని అడ్డుకోవాలని కేసీఆర్‌ ప్రయత్నించడం వృథా ప్రయత్నమన్నారు. నేడు ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు, పార్టీ నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తీరు మారకుంటే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వచ్చితీరుతుందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

Congress
Shabbir Ali
KCR
TSRTC
  • Loading...

More Telugu News