Rain: ఎన్నికల వేళ వర్షాలు.. ఓటర్లకు ఇబ్బందులు!

  • మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో జోరుగా వాన
  • కొన్ని ప్రాంతాల్లో కుండపోత
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇబ్బంది పడుతున్న ఓటర్లు

ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో కుండపోత వర్షం పడుతుండడంతో ఓటర్లు అవస్థలు పడుతున్నారు. మహారాష్ట్రలోని సంగ్లి, నాసిక్‌, పుణె, రత్నగిరి, ఔరంగాబాద్‌ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సింధుదుర్గ్‌, సోలాపూర్‌, బీద్‌, ఉస్మానాబాద్‌ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి.

కొల్హాపూర్‌, సతారా ప్రాంతాల్లోనూ గడచిన రెండు రోజుల నుంచి వర్షం తెరిపివ్వడం లేదు. ఇక కేరళలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా నాలుగు నియోజకవర్గాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురంలోని వట్టియూర్కావు, అళప్పుజలోని ఆరూర్‌, పట్నంతిట్టతోపాటు ఎర్నాకుళం, మాంజేశ్వరం స్థానాల్లో ఒక్క మాంజేశ్వరం మినహా మిగిలిన చోట్ల వర్షాలతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. 

  • Loading...

More Telugu News