Keerthi Suresh: కీర్తి సురేశ్ సహనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే: దర్శకుడు నరేంద్రనాథ్

  • కీర్తి సురేశ్  చాలా గొప్పనటి 
  • ఆమె లుక్స్ హైలైట్ గా నిలుస్తాయి 
  • కీర్తి సురేశ్ కి చెప్పుకోదగిన చిత్రమవుతుందన్న దర్శకుడు

'మహానటి' తరువాత కీర్తి సురేశ్ కథల విషయంలో మరింతగా ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఒక వైపున తమిళంలో స్టార్ హీరోల జోడీ కడుతూనే, తెలుగులో నాయిక ప్రాధాన్యత కలిగిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అలా తెలుగులో ఆమె 'మిస్ ఇండియా' అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు నరేంద్రనాథ్ మాట్లాడుతూ .."కీర్తి సురేశ్ నిజంగా చాలా గొప్ప నటి. ఈ సినిమాలో ఆమె డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తుంది. ఒక్కో దశలో ఆమె ఒక్కో లుక్ తో కనిపిస్తుంది. అందువలన లుక్స్ విషయంలో మేము చాలా కసరత్తు చేశాము. ఒక్కో లుక్ కోసం 10 టెస్టు కట్ లు చేశాము. అలా 50 టెస్టు కట్ లు చేయవలసి వచ్చింది. ఈ విషయంలో కీర్తి సురేశ్ ఎంతో సహకరించారు. ఆమె సహనానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆమె కెరియర్లో ఇది కచ్చితంగా చెప్పుకోదగిన చిత్రమవుతుంది" అని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News