ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో పోలీసుల ముందస్తు అరెస్ట్‌లు.. హౌస్ అరెస్టులు
- ప్రగతి భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
- వరంగల్‌లో డీసీసీ చీఫ్ నాయిని రాజేందర్ గృహ నిర్బంధం
- ముట్టడికి తరలివస్తున్న జగిత్యాల, సిరిసిల్ల నేతల అరెస్ట్
హైదరాబాద్‌లో షబ్బీర్ అలీని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. వరంగల్‌లో డీసీసీ చీఫ్ నాయిని రాజేందర్‌రెడ్డికి గృహ నిర్బంధం విధించారు. అలాగే, వర్ధన్నపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, ఎల్బీనగర్‌లలో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి తరలి వస్తున్న జగిత్యాల, సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.