ISL-6: ఇండియన్ సాకర్ లీగ్ ప్రారంభోత్సవంలో చిరంజీవి సందడి

  • ఐఎస్ఎల్ 6వ సీజన్ ప్రారంభం
  • కేరళ బ్లాస్టర్స్ కు సహయజమానిగా ఉన్న చిరంజీవి
  • ఆరంభ పోరులో కేరళ వర్సెస్ అట్లెటికో కోల్ కతా

భారత్ లో ఫుట్ బాల్ కు ప్రజాదరణ కల్పించేందుకు ఉద్దేశించిన ఇండియన్ సాకర్ లీగ్ (ఐఎస్ఎల్) 6వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బీసీసీఐ కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరులు హాజరయ్యారు. కొచ్చిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవంలో చిరంజీవి సందడి చేశారు. ఐఎస్ఎల్ లో కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీకి చిరంజీవి సహయజమాని అన్న సంగతి తెలిసిందే. కేరళలోనూ చిరంజీవికి విశేషంగా అభిమానులున్నారు.

ఈ నేపథ్యంలో ఐఎస్ఎల్ ఓపెనింగ్ సెర్మనీకి హాజరైన చిరును చూడగానే స్టేడియం హోరెత్తిపోయింది. చిరంజీవి కూడా ఎంతో సంతోషంగా అభిమానులకు అభివాదం చేశారు. కాగా తొలి మ్యాచ్ లో చిరంజీవికి చెందిన కేరళ బ్లాస్టర్స్, సౌరవ్ గంగూలీకి చెందిన అట్లెటికో కోల్ కతా జట్లు తలపడుతున్నాయి. 65 నిమిషాల ఆట పూర్తయ్యే సమయానికి 2-1తో కేరళ బ్లాస్టర్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

ISL-6
Kochi
Chiranjeevi
Kerala Blasters
ATK
Sourav Ganguly
  • Loading...

More Telugu News